shanthi swaroop: అప్పట్లో రూమ్ లో నుంచి వెళ్లగొట్టేశారు .. నడిరోడ్డు మీదకొచ్చేశాను: 'జబర్దస్త్' శాంతి స్వరూప్

  • రూమ్ లో నుంచి నా బ్యాగ్ బయట పడేశారు 
  • ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏడ్చాను 
  • ఆ దర్శకుడు ఆశ్రయం ఇచ్చాడు 
  • ఆయనకి రుణపడి వున్నాను
'జబర్దస్త్' షోతో పాప్యులర్ కావడానికి ముందు తనకి ఎదురైన పరిస్థితులను గురించి శాంతిస్వరూప్ ఐ డ్రీమ్స్ తో ప్రస్తావించాడు. "రూమ్ రెంట్ కట్టుకోలేని నేను వేరేవాళ్లని బతిమాలుకొని వాళ్ల రూమ్ లో ఉండేవాడిని. అక్కడ ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రూమ్ లోనుంచి వెళ్లిపొమ్మని అన్నారు .. నా బ్యాగ్ తీసి బైట పెట్టేసిన సందర్భాలు వున్నాయి"

"ఒకసారి అలాగే బ్యాగ్ బయట వేశారు .. ఎక్కడికి వెళ్లాలో తెలియక అరుగుమీద ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు నాకు కాస్త పరిచయమున్న దర్శకుడు చౌదరిగారికి ఫోన్ చేశాను .. నడి రోడ్డు మీద వున్నట్టుగా చెప్పాను. వెంటనే ఆయన వచ్చి నన్ను తన స్నేహితుడి రూమ్ కి తీసుకెళ్లాడు. ఆయన స్నేహితుడు ఊళ్లో లేకపోవడం వలన, ఆయనకి ఫోన్ చేసి అనుమతి తీసుకుని అక్కడ నాకు ఆశ్రయం ఇచ్చాడు. 9 నెలల పాటు అక్కడే ఉండగా .. ఆయనే రెంట్ కట్టారు .. ఆయనకి నేను రుణపడివున్నాను" అని అన్నారు.  
shanthi swaroop

More Telugu News