మదర్సాల్లో మోదీ ఫొటో పెట్టాలంటూ ఆదేశాలు... ససేమిరా అన్న మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్

మదరసాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలపై మదర్సా ఉపాధ్యాయులు మండిపడ్డారు. ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించారు. మదర్సాలలో వ్యక్తుల ఫొటోలు పెట్టడం ఇస్లాంకు వ్యతిరేకమని... ఎట్టి పరిస్థితుల్లోనూ తాము మోదీ ఫొటోను పెట్టబోమని అన్నారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. మదర్సాలకు రాజకీయ రంగు పులమొద్దని రూర్కీకి చెందిన మదర్సా ఉపాధ్యాయుడు ఎహసాన్ సాహెబ్ కోరారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. 


More Telugu News