Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లాలూ ప్రసాద్ యాదవ్‌కి కాసేపట్లో శిక్ష ఖరారు.. ఉత్కంఠ!

  • దాణా కుంభకోణం కేసులో ఇటీవలే తీర్పు
  • లాలూని దోషిగా ప్రకటించిన కోర్టు
  •  రాంచీలోని సీబీఐ కోర్టుకు చేరుకున్న లాలూ
సుదీర్ఘంగా కొన‌సాగిన దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఇటీవ‌లే రాంచీలోని సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన  విష‌యం విదిత‌మే. ఈ కేసులో ఆయ‌నతో పాటు మ‌రో 15 మందిని కూడా దోషులుగా తేల్చింది. కేసులో తీర్పును వెల్ల‌డించినప్ప‌టి నుంచి లాలూ ప్ర‌సాద్‌ యాద‌వ్  బిర్సా మండా సెంట్ర‌ల్ జైలులో ఉంటున్నారు.

ఈయనకు కాసేప‌ట్లో రాంచీలోని సీబీఐ కోర్టు శిక్ష ఖ‌రారు చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో దోషి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను పోలీసులు కోర్టు వ‌ద్ద‌కు తీసుకొచ్చారు. కాగా, దేవ్‌గ‌డ్ ఖ‌జానా నుంచి దాణా కొనుగోలు పేరిట లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ అక్ర‌మంగా నిధులు డ్రా చేశారనే విషయాన్ని ఇటీవ‌ల కోర్టు నిర్ధారించింది.
lalu prasad yadav
verdict
ranchi

More Telugu News