Chandrababu: చంద్రబాబు శ్రద్ధ ప్రాజెక్టుల్లో వచ్చే కమీషన్లపైనే!: వైఎస్ జగన్ ఆరోపణ
- సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే ఆలోచన చంద్రబాబుకు లేదు
- రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను ఆయన మోసం చేశారు
- కలికరి ప్రజా సంకల్ప యాత్రలో జగన్
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. చిత్తూరు జిల్లా కలికిరి ప్రజా సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల్లో వచ్చే కమీషన్లపైనే చంద్రబాబు శ్రద్ధ పెడుతున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే ఆలోచన చంద్రబాబుకు లేదని, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను ఆయన మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు అనుభవం ఉంది కదా అని ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించారని, అధికారంలోకి వచ్చిన ఆయన, ప్రతిఒక్కరినీ మోసగించారని విమర్శించారు. కులాల పరంగా చంద్రబాబు మ్యానిఫెస్టో తెచ్చారని అన్నారు. చంద్రబాబును విమర్శించే నిమిత్తం ఈ సందర్భంగా ఓ పులికథను జగన్ ప్రస్తావించారు.