Pawan Kalyan: ఇద్ద‌ర‌మ్మాయిల‌ మధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. 'అజ్ఞాత‌వాసి' న్యూ స్టిల్‌!

  • విడుదలకు సిద్ధమవుతోన్న 'అజ్ఞాత‌వాసి'
  • కొత్త స్టైల్లో పవన్ 
  • అలరిస్తోన్న న్యూ స్టిల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించిన చిత్రం అజ్ఞాతవాసి విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ ఈ సినిమాలో పవన్ సరసన నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ రోజు అజ్ఞాత‌వాసికి సంబంధించిన ఓ స్టిల్‌ను సినిమా బృందం విడుద‌ల చేసింది. ఇందులో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ మధ్యలో పవన్ కల్యాణ్ కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. టీ షర్ట్, జీన్స్ ప్యాంటులో పవన్ కొత్త స్టైల్లో కనపడుతున్నాడు. మీరూ చూడండి..    
Pawan Kalyan
still
Agnyaathavaasi

More Telugu News