తరచుగా నన్ను పిలిచేవాడు.. అసభ్యకరంగా చూసేవాడు!: గజల్ శ్రీనివాస్ బాధితురాలు!
సేవ్ టెంపుల్ కార్యాలయంలో గాయకుడు గజల్ శ్రీనివాస్ తనను తరుచుగా పిలిచేవాడని, అసభ్యకరంగా చూసేవాడని బాధితురాలు చెప్పారు. ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ మంచి లక్ష్యంతో పనిచేస్తోందని భావించి అందులో చేరానని అన్నారు. కానీ, గజల్ శ్రీనివాస్ ప్రవర్తనతో భయపడిపోయానని తెలిపారు. కొన్ని నెలలుగా ఆయన తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రెండు నెలలుగా వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. గజల్ శ్రీనివాస్ తనను చాలా సమయం ఆయన ముందే కూర్చోమని చెప్పేవారని అన్నారు.
తాను చేస్తోన్న పని పరంగా రాత్రి పూట కార్యాలయంలో ఉండే అవసరం లేదని, సాయంత్రం 6 గంటలకు పని అయిపోయేదని, వెళ్లిపోయేదాన్నని బాధితురాలు తెలిపారు. సాయంత్రం సమయంలో తనను పిలిచి ఇంకాస్త సమయం ఉండమని బలవంత పెట్టేవాడని అన్నారు. ఈ కేసులో పోలీసులు బాగానే స్పందిస్తున్నారని చెప్పారు. ఆలయవాణిలో చేరాకే తనకు గజల్ శ్రీనివాస్ పరిచయం అయ్యాడని అన్నారు. అధిక సమయం ఉండబోనని ఓ సారి చెప్పానని, దాంతో తనను బెదిరించాడని, ఓ సారి బాగా తిట్టాడని అన్నారు. ఎక్కువ సేపు మాట్లాడుతూ అసభ్యకరంగా తనను చూస్తూ ఉండేవాడని చెప్పారు.