Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది .. స్నేహకు క్షమాపణ చెప్పేసిన దర్శకుడు

  • 'వేలైక్కారన్' లో స్నేహ పాత్ర నిడివి తగ్గింపు 
  • దర్శకుడి తీరు పట్ల స్నేహ అసహనం
  • అలా చేయక తప్పలేదన్న మోహన్ రాజా        
శివకార్తికేయన్ .. నయనతార జంటగా దర్శకుడు మోహన్ రాజా 'వేలైక్కారన్' సినిమాను తెరకెక్కించాడు. ఇటీవల అక్కడ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో స్నేహ ఒక కీలకమైన పాత్రను పోషించారు. సినిమా చూసిన ఆమె .. తన పాత్ర నిడివి చాలా వరకూ తగ్గించడం పట్ల దర్శకుడిపై తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శించారట. మొత్తంగా తన పాత్ర నిడివిని 15 నిమిషాలకే కుదించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారట.

 దాంతో మోహన్ రాజా స్పందిస్తూ .. స్నేహతో పాటు మరికొందరు నటీనటులు చేసిన సీన్స్ ను కూడా తొలగించినట్టు ఆయన చెప్పారు. స్నేహ సీన్స్ ను తగ్గించవలసి వచ్చినందుకు తాను చాలా బాదపడ్డాననీ .. కానీ తప్పని సరి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందని అన్నారు. స్నేహ మనసుకు కష్టాన్ని కలిగించినందుకు తాను క్షమాపణ చెబుతున్నాననీ, ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
sneha
mohan raja

More Telugu News