గజల్ శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
ఓ యువతిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మహిళల పట్ల గజల్ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించేవాడని, అభ్యంతరకరమైన ప్రాంతాల్లో మసాజ్ చేయాలని బెదిరించేవాడనే విషయాలు పోలీసులకు బాధితురాలు ఇచ్చిన స్టింగ్ ఆపరేషన్ వీడియోల ద్వారా బయటపడింది. కాగా, ఏ1గా గజల్ శ్రీనివాస్, ఏ2గా పనిమనిషి పార్వతి పేర్లను చేర్చారు.
మరోపక్క, గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ముగిసే సమయంలో ఈ బెయిల్ పిటిషన్ వెళ్లడంతో విచారణను రేపటికి వాయిదా వేశారు. ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైనప్పుడు రెండు వైపుల సాక్ష్యాధారాల పరిశీలన, వాదోపవాదనలు విన్న తర్వాత బెయిల్ మంజూరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. గజల్ శ్రీనివాస్ ను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో రేపు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.