Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆఫీస్‌లోనే ప‌ని మ‌నిషి పార్వ‌తితో మ‌సాజ్ చేయించుకున్న గ‌జ‌ల్ శ్రీనివాస్‌

  • గ‌జ‌ల్ శ్రీనివాస్ ప‌ని మ‌నిషి పార్వ‌తి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్న పోలీసులు
  • గ‌జ‌ల్ శ్రీనివాస్ కు స‌హ‌క‌రించాల‌ని ఆ యువ‌తిని కోరుతోన్న పార్వ‌తి
  • ఆఫీస్‌లోనే బెడ్‌రూమ్ ఏర్పాటు చేసుకున్న గ‌జ‌ల్ శ్రీనివాస్‌
ఓ యువ‌తిని లైంగిక‌ వేధింపుల‌కు గురి చేసిన‌ కేసులో గాయ‌కుడు, ర‌చ‌యిత గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను పోలీసులు నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌ర్చి చంచ‌ల్ గూడ జైలుకి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో గ‌జ‌ల్ శ్రీనివాస్ ప‌ని మ‌నిషి పార్వ‌తి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసుకున్నారు. ప‌నిమ‌నిషి పార్వ‌తిని ఈ కేసులో ఏ2 గా చేర్చినట్లు స‌మాచారం.

గ‌జ‌ల్ శ్రీనివాస్ కు స‌హ‌క‌రించాల‌ని ఆ యువ‌తిని ప‌నిమ‌నిషి పార్వ‌తి బ‌ల‌వంత పెట్టిన‌ట్లు తెలిసింది. ఆమెను ఒప్పించడానికి రెండు నెల‌లుగా పార్వ‌తి రేడియో జాకీ వెంట ప‌డుతోంది. ఆఫీస్‌లోనే బెడ్‌రూమ్ ఏర్పాటు చేసుకున్న గ‌జ‌ల్ శ్రీనివాస్‌.. అక్క‌డే ప‌ని మ‌నిషి పార్వ‌తితోనూ మ‌సాజ్ చేయించుకున్నట్లు స‌మాచారం. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన రేడియో జాకీతో గ‌జ‌ల్ శ్రీనివాస్‌.. ఇటీవల అర్ధ‌రాత్రి దాటే వ‌ర‌కు ఆఫీసు పని చేయించుకున్న‌ట్లు తెలిసింది.    
gazal srinivas
parvathi
massage

More Telugu News