వైమానిక దాడిలో బిన్ లాడెన్ మ‌నవ‌డు హతం?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైమానిక దాడిలో బిన్ లాడెన్ మ‌నవ‌డు హతం?

  • జూన్‌లో జ‌రిగిన వైమానిక దాడి
  • పాక్‌-ఆఫ్ఘ‌నిస్తాన్ స‌రిహ‌ద్దులో దాడి
  • ఒసామా కొడుకు లేఖ‌తో బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం
అల్ ఖైదా ఉగ్ర‌వాది ఒసామా బిన్ లాడెన్ మ‌న‌వ‌డు ఒసామా బిన్ హ‌మ్జా బిన్ లాడెన్ మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. ప‌న్నెండేళ్ల ఒసామా హ‌మ్జా, పాకిస్థాన్ - ఆఫ్ఘ‌నిస్తాన్ స‌రిహ‌ద్దులో జూన్ - జులైలో జ‌రిగిన వైమానిక దాడిలో మృత్యువాత ప‌డ్డ‌ట్లు స‌మాచారం. కొడుకు మ‌ర‌ణ‌వార్త‌ను తెలియ‌జేస్తూ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హ‌మ్జా బిన్ లాడెన్ రాసిన లేఖ ద్వారా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

అయితే ఈ లేఖ‌లో మ‌ర‌ణించాడ‌ని మాత్ర‌మే హ‌మ్జా వెల్ల‌డించాడు. ఎలా మ‌ర‌ణించాడ‌నే విష‌యాన్ని తెలియ‌జేయ‌లేదు. లేఖ‌లో హ‌మ్జా పేర్కొన్న స‌మ‌యం ప్ర‌కారం ఒసామా హ‌మ్జా వైమానిక దాడిలోనే మ‌రణించి ఉంటాడ‌ని అర‌బిక్ మీడియా క‌థ‌నాలు రాసింది.
air strike
osama bin
laden
Pakistan

More Telugu News