ఉత్తరకొరియాతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి: అమెరికా
- ఉత్తరకొరియాతో యుద్ధ పరిస్థితులు తలెత్తేలా ఉన్నాయి
- ఆ దేశంతో అమెరికా యుద్ధానికి దగ్గరవుతోంది
- దౌత్యపరంగా పరిష్కరించే అవకాశం ఉందని అనుకోవడం లేదు
- -యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాజీ ఛైర్మన్ మైక్ ముల్లెన్
తాజాగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ ఎవరిమాటా వినకుండా ఉత్తరకొరియా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఉత్తరకొరియా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అమెరికా ఇప్పటికే సైనిక విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే.