తెలంగాణ పోలీసు స్టేషన్లన్నింటికి సోషల్ మీడియా ఖాతాలు!
- ఫేస్‌బుక్, ట్విట్టర్ల ద్వారా ప్రజలకు అందుబాటులో
- త్వరలో అమలు
- వెల్లడించిన డీజీపీ మహేందర్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 800 పోలీసు స్టేషన్లకు ప్రత్యేక సోషల్‌మీడియా ఖాతాలను సృష్టించనున్నారు. మొదట హైద్రాబాద్‌లోని స్టేషన్లకి, తర్వాత ఇతర జిల్లాల్లోని స్టేషన్లకి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ ఖాతాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటామని మహేందర్ రెడ్డి చెప్పారు.