ఫేస్బుక్లో వైసీపీ అధినేత జగన్‌పై అభ్యంతరకర పోస్టు.. కేసు నమోదు
- కృష్ణా జిల్లా కోసూరుకు చెందిన సురేశ్ కుమార్‌పై కేసు నమోదు
- ఫేస్బుక్ ఖాతా ఆధారంగా దర్యాప్తు ప్రారంభం
- త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామన్న పోలీసులు
ఇటీవల రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారి సంఖ్య ఎక్కువైంది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇటువంటి పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. గతంలో ఇటువంటి పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ప్రస్తుతం జగన్ ప్రజా సంకల్ప యాత్రలో బిజీగా ఉన్నారు.