Sunkara Padmasri: నేను నాటకాలదాన్నా?... కన్నీళ్లనూ వెక్కిరిస్తున్నావా?: కాంగ్రెస్ నాయకురాలిపై నన్నపనేని రాజకుమారి భావోద్వేగం

  • సుంకర పద్మశ్రీకి కౌంటరిచ్చిన నన్నపనేని
  • ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్
  • సురభి చరిత్ర గురించి ఏం తెలుసని ఎద్దేవా
తనపై సంచలన విమర్శలు చేసిన ఏపీ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీకి ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్శన్ నన్నపనేని రాజకుమారి కౌంటర్ ఇచ్చారు. పద్మశ్రీకి దమ్ము, ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మీడియాను పిలిచి వారి ముందే ఎవరేం చేశారో తేల్చుకుందామని అన్నారు. తన కన్నీళ్లను కూడా ఆమె వెక్కిరించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తనను సురభి నాటకాల కంపెనీ ఆర్టిస్టులతో పోల్చిందని, తాను మహిళల హక్కుల పరిరక్షణకు నడుం బిగించి, పర్యటనలు చేస్తుంటే, నాటకాలదాన్నని అన్నారని, సురభి నాటక కంపెనీ చరిత్ర, గొప్పదనం పద్మశ్రీకి ఏం తెలుసని ప్రశ్నించారు. ఈ వయసులో కూడా తాను ప్రజల సమస్యలు తీర్చాలని శ్రమిస్తున్నానని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. తనపై ఆమె దారుణమైన ఆరోపణలు చేశారని విమర్శించారు.
Sunkara Padmasri
Nannapaneni Rajakumari
Surabhi
Drama Artist

More Telugu News