chiranjeevi: ఫిబ్రవరి నుంచి 'సైరా' సెట్స్ పైకి నయనతార!

  • రెండవ షెడ్యూల్ కి రెడీగా 'సైరా'
  • కథానాయికగా నయనతార 
  • ఆమెను మారుస్తారనే ప్రచారంలో నిజం లేదు
చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, తాజాగా ఒక షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార పేరును ప్రకటించడం జరిగింది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ మొదలు కాకపోవడం వలన, నయనతార డేట్స్ ను సర్దుబాటు చేయలేకపోతోందనే టాక్ బయటికి వచ్చింది.

ఆమె కారణంగానే రెండవ షెడ్యూల్ ఇంకా మొదలు కాలేదనీ, మరో హీరోయిన్ ను తీసుకునే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదనేది తాజా సమాచారం. నయనతార ముందుగా ఇచ్చిన డేట్స్ ప్రకారమే ఆమె ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి రానుందని అంటున్నారు. చిరంజీవి .. నయనతార కాంబినేషన్లోని సన్నివేశాలను ఫిబ్రవరిలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ .. జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ ముఖ్యమైన పాత్రలు చేస్తోన్న సంగతి తెలిసిందే.      
chiranjeevi
nayanatara

More Telugu News