లక్ష్యాన్ని దాటిపోయిన కేంద్ర ద్రవ్య లోటు... మోదీ సర్కారు ఏం చేస్తుందో...?
- నవంబర్ నాటికే లక్ష్యంలో 112 శాతానికి చేరిక
- జీఎస్టీ వసూళ్లు పడిపోవడమే కారణం
- జీడీపీలో లోటు 3.2 శాతంగా ఉండాలన్నది కేంద్రం లక్ష్యం
2017-18 సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి పరిమితం చేయాలన్నది మోదీ సర్కారు లక్ష్యం. జీఎస్టీ చట్టం ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రాగా, ఆ తర్వాత పన్ను ఆదాయం నవంబర్ నెలలో అత్యంత కనిష్టానికి పడిపోవడం కేంద్రాన్ని ఇబ్బంది పెట్టే అంశమేనన్నది విశ్లేషకుల అంచనా. అక్టోబర్ లో జీఎస్టీ వసూళ్లు రూ.83,000 కోట్లు అయితే, నవంబర్ లో ఇవి రూ.80,808 కోట్లకు తగ్గాయి. దీంతో మోదీ సర్కారు ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.