Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వారం రోజులు పూర్తి కాక‌ముందే రూ. 200 కోట్ల క్ల‌బ్‌లో చేరిన 'టైగ‌ర్ జిందా హై'

  • వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న స‌ల్మాన్ చిత్రం
  • రూ. 300 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంద‌ని అంచ‌నా
  • అలా జరిగితే స‌ల్మాన్ రికార్డు
విడుద‌లై వారం రోజులు కూడా పూర్తికాక‌ముందే స‌ల్మాన్ ఖాన్ 'టైగ‌ర్ జిందా హై' చిత్రం రూ. 200 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది. 2017వ సంవ‌త్స‌రం ముగింపులో విప‌రీత‌మైన వ‌సూళ్ల‌తో రికార్డు బుక్కుల‌ను ఈ చిత్రం తిర‌గ‌రాస్తోంది. వ‌సూళ్లు ఇలాగే కొన‌సాగి రూ. 300 కోట్ల క్ల‌బ్‌లో కూడా చేరుతుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.

ఒకవేళ అలా జ‌రిగితే రూ. 300 కోట్ల క్ల‌బ్‌లో ఎక్కువ సినిమాలు ఉన్న న‌టుడిగా సల్మాన్ రికార్డు సృష్టిస్తాడు. ఇప్ప‌టికే 'బ‌జ‌రంగీ భాయ్‌జాన్‌', 'సుల్తాన్' చిత్రాలు రూ. 300 కోట్ల క్ల‌బ్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. గురువారం వ‌సూలు చేసిన రూ. 15.42 కోట్ల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 'టైగ‌ర్ జిందా హై' చిత్రం రూ. 206.04 కోట్లు వ‌సూలు చేసింది.
tiger zinda hai
Salman Khan

More Telugu News