Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూ ఇయ‌ర్ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌కి డ్రగ్స్ తరలింపు.. ముగ్గురి అరెస్ట్

  • 25 గ్రాముల కొకైన్‌, 30 గ్రాముల హెరాయిన్ ప‌ట్టివేత‌
  • నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు తెస్తోన్న ముఠా అరెస్టు
  • ముగ్గురు నైజీరియ‌న్ల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైద‌రాబాద్‌లో మ‌రోసారి డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేగింది. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో యువ‌తే ల‌క్ష్యంగా డ్ర‌గ్స్ ముఠాలు న‌గ‌రానికి భారీగా మాద‌క ద్ర‌వ్యాల‌ను త‌ర‌లిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నిఘా ఉంచిన పోలీసులు ఈ రోజు ఓ ముఠాను ప‌ట్టుకున్నారు. వారి నుంచి భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్ర‌గ్స్ ముఠాకు చెందిన‌ ముగ్గురు నైజీరియ‌న్ల‌ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు. వారి నుంచి  25 గ్రాముల కొకైన్‌, 30 గ్రాముల హెరాయిన్ ల‌భ్యం అయిన‌ట్లు తెలిపారు. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం ఆ ముఠా డ్ర‌గ్స్ తీసుకొచ్చింద‌ని చెప్పారు.     
new year
drugs
Police
arrested
Hyderabad

More Telugu News