surveen chawla: రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకుని, ఇప్పుడు వెల్లడించిన బాలీవుడ్ నటి

  • 2015లోనే సుర్వీన్ చావ్లా వివాహం
  • ప్రియుడు అక్షయ్ ఠాకూర్ తో పెళ్లి
  • వ్యక్తిగత కారణాలతో వెల్లడించని సుర్వీన్
బాలీవుడ్ చిత్రం 'హేట్ స్టోరీ-2'లో హాట్ హాట్ గా కనిపించిన నటి సుర్వీన్ చావ్లా రెండేళ్ల క్రితమే సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. మూడో కంటికి తెలియకుండా ఇది జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. తన ప్రియుడు అక్షయ్ ఠాకూర్ తో సుర్వీన్ వివాహం జరిగింది. ఇటలీలో క్రిస్టియన్ పద్ధతిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన సుర్వీన్... 2015 జూలై 18న తమ పెళ్లి జరిగిందని తెలిపింది. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈ విషయాన్ని తాము బహిరంగపరచలేదని చెప్పింది. ఇప్పుడు భారతీయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని తెలిపింది. డెసెంబర్ లో చేసుకుందామని అనుకుంటే... తమ కుటుంబంలో ఒక విషాద ఘటన నెలకొందని చెప్పింది. వచ్చే ఏడాది చేసుకుంటామని తెలిపింది
surveen chawla
surveen chawla marriage

More Telugu News