Jagan: చిత్తూరు జిల్లాలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బెంగళూరు బయల్దేరిన జగన్

  • చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన జగన్ పాదయాత్ర
  • యాత్ర ముగించుకుని బెంగళూరు పయనం
  •  అక్కడి నుంచి హైదరాబాదుకు
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా బలిజపల్లి శివారు నుంచి నేటి యాత్రను ప్రారంభించిన జగన్ తంబళ్లపల్లి మండలం ఎద్దులవారికోట గ్రామం నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. కాసేపటి క్రితం ఆయన పాదయాత్రకు విరామం ఇచ్చారు.

దీంతో అక్కడి నుంచి జగన్ నేరుగా బెంగళూరుకు బయల్దేరారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్రమాస్తుల కేసులో రేపు (శుక్రవారం) సీబీఐ కోర్టు విచారణకు ఆయన హాజరుకానున్నారు. ఈనాటి 46వ రోజు పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆయన యాత్ర 5.1 కిలోమీటర్ల మేర సాగింది.  
Jagan
jagan padayatra

More Telugu News