Chandrababu: ఏపీలో భవిష్యతులో ఎలాంటి నేరాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

  • తుళ్లూరులో ఏపీ ఫోరెన్సిక్ భవనానికి శంకుస్థాపన
  • నేరాలు జరగకుండా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలి
  • ప్రపంచంలోనే మంచి ల్యాబ్ గా పేరు పొందాలి 
ఏపీలో భవిష్యత్ లో ఎలాంటి నేరాలు జరిగేందుకు వీల్లేకుండా, పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఏపీ ఫోరెన్సిక్ భవనానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నామని, దీని నిర్మాణంలో ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్ షిప్ కు అవకాశం కల్పిస్తామని అన్నారు. మూడేళ్ల తర్వాత ప్రపంచంలోనే మంచి ల్యాబ్ గా దీనికి పేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్వహణకు పోలీస్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు.
Chandrababu
Telugudesam

More Telugu News