ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత!
- కూలగొట్టిన తమ ఇళ్లకు ఇంత వరకు నష్ట పరిహారం చెల్లించలేదు
- సీఎం నివాసం వద్ద ఇబ్రహీంపట్నం వాసుల ధర్నా
- పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోబోయిన యువకుడు
తమ ఆవేదనను చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి వద్దకు వస్తే, ఆయన తమకు సమయం ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. 10 రోజుల్లోనే నష్ట పరిహారం చెల్లిస్తామని అప్పుడు హామీ ఇచ్చారని... మూడేళ్లయినా తమను తిప్పుతూనే ఉన్నారని అన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు.