పోలీసుల ఎదుట లొంగిపోయిన కమెడియన్ విజయ్ భార్య వనితా రెడ్డి
- సాక్ష్యాల సేకరణ కోసమే ఆలస్యం
- తన భర్తను వేధించలేదని వ్యాఖ్య
- సెల్ఫీ వీడియోలో తన పేరు ఎందుకు ప్రస్తావించాడో తెలియదన్న వనితా రెడ్డి
వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విజయ్, తన భార్య, మరో ఇద్దరు కలిసి తనను వేధించారని చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియోలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి పరారీలో ఉన్న వనితా రెడ్డి, విజయ్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలను వనితా రెడ్డి విడుదల చేసింది. వాటితో పాటు మరికొన్ని ఆధారాలను కూడా సేకరించి ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.