నాకు దొరికారు మీలాంటి వాళ్లు!: యోగికి నటి హారిక మెసేజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు దొరికారు మీలాంటి వాళ్లు!: యోగికి నటి హారిక మెసేజ్

  • ఆంతరంగిక విషయాలు చర్చించిన హారిక
  • కల్యాణ్ లాంటి బాయ్ ఫ్రెండ్ తనకెందుకు దొరకలేదన్న హారిక
  • గంట మాట్లాడితే ఏదో చేయాలని చూస్తారని ఆరోపణ
తనను లైంగికంగా వేధించాడంటూ దర్శకుడు యోగిపై కేసు పెట్టిన నటి హారిక, అంతకుముందు అతనితో చాలా చనువుగా ఉండి, తన ఆంతరంగిక విషయాలను కూడా చర్చించినట్టు తెలుస్తోంది. కేసు పెట్టేందుకు రెండు రోజుల ముందు హారికకు, తనకు మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణలను యోగి ఇప్పుడు పోలీసులకు ఇవ్వగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.

 ఈ మెసేజ్ లలో "అబ్బాయిలకు ట్రూ అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటే వారితో ఆడుకుందాం అనే ఉంటదా?", "ఎందుకు ప్రత్యూకి దొరికారు కల్యాణ్ (ఓ ప్రముఖ నిర్మాత కుమారుడు) లాంటి బాయ్ ఫ్రెండ్?", "నాకు దొరికారు మీ లాంటి వాళ్లు" అంటూ మెసేజ్ లు పెట్టింది. ఎవరితోనైనా ఒక గంట మాట్లాడితే చాలు, ఏదో చేయాలని చూస్తారని, దాంతో ఉన్న ఫీలింగ్స్ అన్నీ పోతాయని వ్యాఖ్యానించింది.

ఇక హారిక మెసేజ్ లకు సమాధానంగా "నేనేం ప్రొడ్యూసర్ కొడుకుని, హ్యాండ్ సమ్ హంక్ ని కాదుగా మరి", "ట్రూ క్రేజీ గార్ల్స్ పడరు" అని యోగి సమాధానం ఇచ్చినట్టు పోలీసులకు ఇచ్చిన వాట్స్ యాప్ స్క్రీన్ షాట్స్ లో కనిపిస్తోంది.
Harika
Yogi
Whats App

More Telugu News