Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తోడు కావాలి, విదేశాలు తిరగాలి... మడికట్టుకుని కూర్చోబోనన్న నటి హారిక... మెసేజ్ లను పోలీసులకు ఇచ్చిన దర్శకుడు యోగి!

  • వాట్స్ యాప్ స్క్రీన్ షాట్స్ ను పోలీసులకు ఇచ్చిన యోగి
  • తన తప్పేమీ లేదని వాదిస్తున్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్
  • వేరే దేశానికి వెళ్లి ఎంజాయ్ చేసి రావాలని ఉంది
  • మెసేజ్ లు పెట్టిన హారిక
షార్ట్ ఫిల్మ్ నటి హారికను దర్శకుడు యోగి వేధించినట్టు ఆరోపణలు వచ్చిన కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ వ్యవహారంలో పోలీసు స్టేషన్లో యోగిని కాలితో తన్నిన డీసీపీ గంగిరెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే దిశగా విచారణ జరుపుతున్న పోలీసులకు, తనదేమీ తప్పు లేదని, హారికదే తప్పని చెప్పేలా వాట్స్ యాప్ మెసేజ్ సాక్ష్యాలను యోగి పోలీసులకు అందించాడు.

ఈ సంభాషణల్లో తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనని యోగికి హారిక మెసేజ్ పెట్టినట్టు ఉంది. తనకు ఓ యువకుడి తోడు కావాలని, అతను ప్రేమను పంచుతూ ఆప్యాయంగా చూసుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పింది. ఆ బాయ్ ఫ్రెండ్ అంగీకరిస్తే, వేరే దేశానికి వచ్చేందుకు తాను సిద్ధమని కూడా చెప్పింది. అక్కడే కొంతకాలం హాయిగా బతకాలని ఉన్నట్టు చెప్పింది. తనకు సెక్స్ అక్కర్లేదని, కానీ, తనను చూసుకునే వాడికి అది కావాలంటే మాత్రం అభ్యంతరం లేదని చెప్పింది.

మళ్లీ పెళ్లి చేసుకుంటే కెరీర్ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మరో మెసేజ్ లో తాను సిగరెట్, మద్యం తాగుతానని, ఈ కాలంలో మడిగట్టుకుని కూర్చుంటే ఏం సాధిస్తామని ప్రశ్నించింది. తనకు సినిమా అవకాశాలు రావడం లేదని, అవకాశాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పింది. ఈ మెసేజ్ ల స్క్రీన్ షాట్స్ ను పోలీసులకు పంపాడు యోగి.
Harika
Yogi
Whats App
Message

More Telugu News