రష్యన్ బెల్లీ డ్యాన్సర్ల చిందు.. అంబులెన్స్‌లో మద్యం.. మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఘటన.. యూపీ సీఎం సీరియస్!
- పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఏరులై పారిన మద్యం
- డ్యాన్సులతో హోరెత్తించిన రష్యన్ బెల్లీ డ్యాన్సర్లు
- సీఎం యోగి సీరియస్..విచారణకు ఆదేశం
అంతవరకు బాగానే ఉన్నా.. ఈ కార్యక్రమానికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో ఒకటి ఇప్పుడు సంచలనం రేపింది. బయట ఆసుపత్రి ఆవరణలో నిలిపి ఉంచిన అంబులెన్స్ నిండా మద్యం బాటిళ్లు ఉన్నాయి. బార్ టెండర్లు, క్రిస్మస్ క్యాప్‌లను ధరించిన అమ్మాయిలు వైద్యులకు మద్యం పోస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆ అమ్మాయిలు బాలీవుడ్ పాటలకు బెల్లీ డ్యాన్స్‌లతో హోరెత్తించారు.
ఈ ఘటన వైరల్ కావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. జిల్లా మేజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్లను మందలించారు. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, మీడియా ద్వారానే తనకూ తెలిసిందని తాత్కాలిక ప్రిన్సిపాల్ వినయ్ అగర్వాల్ తెలిపారు.