Congress: రేవంత్ ప్రజాదరణ ఉన్న యువనేత : మధు యాష్కీ ప్రశంసలు

  • రాజకీయాల్లో పార్టీలు మారడం మామూలే
  • ప్రతిపక్షం నుంచి ఎవరొచ్చినా తీసుకోవాలన్నదే కాంగ్రెస్ పాలసీ
  • ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ
టీడీపీకి గుడ్ బై  చెప్పి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో మంచి ప్రజాదరణ ఉన్న, యువతలో ఆదరణ ఉన్న యువనేత రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. ఇలాంటి నేతలు ‘కాంగ్రెస్’ లోకి రావడం వల్ల పార్టీ బలోపేతమయ్యేందుకు అవకాశముందని అన్నారు.

రాజకీయాల్లో పార్టీలు మారడం మామూలేనని, ప్రతిపక్ష పార్టీ నుంచి తమ పార్టీలోకి ఎవరొచ్చినా తీసుకోవాలన్నదే కాంగ్రెస్ పాలసీ అని అన్నారు. ఈ సందర్భంగా, కొద్ది రోజుల క్రితం తీర్పు వెలువడిన 2జీ కేసు గురించి ఆయన ప్రస్తావించారు. అసలు, 2జీ స్కాం అనేదే జరగలేదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గతంలోనే చెప్పిందని అన్నారు. ఈ కేసు నిలబడేది కాదని నాడు కపిల్ సిబాల్ చెప్పారని, ఈ విషయాన్ని ప్రజలు నాడు నమ్మలేదని అన్నారు.
Congress
Revanth Reddy

More Telugu News