Shoiab Malik: ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు కొట్టిన షోయబ్ మాలిక్ వీడియో... అయినా యువరాజ్ రికార్డు పదిలమే!

  • చారిటీ మ్యాచ్ లో బౌలర్ కు చుక్కలు చూపించిన షోయబ్
  • రికార్డుల్లోకి ఎక్కే అవకాశం లేకపోవడంతో యువీ పేరు పదిలమే
  • వైరల్ అవుతున్న షోయబ్ వీడియో
ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు... ఈ మాట వినగానే ముందు గుర్తొచ్చేది రవిశాస్త్రి అయితే, ఆ తరువాత వినిపించే పేరు యువరాజ్ సింగ్ దే. 2007 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో బ్రాడ్ బౌలింగ్ వేస్తున్న వేళ, సిక్సర్ల మోత మోగించిన యువీని ఎవరూ మరచిపోలేరు. ఇప్పుడు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టాడు.

 అయితే, అది ఓ చారిటీ మ్యాచ్. దీంతో షోయబ్ ఘనత రికార్డుల్లోకి ఎక్కే అవకాశం లేదు. అఫ్రిదీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫైసలాబాద్ లో ఓ మ్యాచ్ జరుగగా, షోయబ్ ఆరు బంతులనూ మైదానం దాటించాడు. ఆ ఓవర్ సాగిన తీరు వీడియోను మీరూ చూడవచ్చు.
Shoiab Malik
Yuvaraj Singh
Sis Sixes

More Telugu News