Kulbhushan Jadav: పాకిస్థాన్ షార్ప్ షూటర్స్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, అత్యంత భద్రత మధ్య భారీ కాన్వాయ్... ఇస్లామాబాద్ లో జాదవ్ ఫ్యామిలీ!

  • జాదవ్ ఫ్యామిలీకి కనీవినీ ఎరుగని భద్రత
  • కవరేజ్ కోసం బారులు తీరిన మీడియా
  • మరికాసేపట్లో జాదవ్ ను కలవనున్న తల్లి, భార్య
పాకిస్థాన్ రేంజర్లకు దొరికిపోయి, మరణశిక్ష విధించబడ్డ కులభూషణ్ జాదవ్ ను పరామర్శించేందుకు ఆయన భార్య, తల్లి నేడు పాకిస్థాన్ కు చేరుకున్న వేళ, వారికి కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను కల్పించారు. ఉగ్రవాదుల నుంచి వారికి ప్రాణహాని కలుగవచ్చన్న అనుమానంతో కట్టుదిట్టమైన భద్రత, భారీ కాన్వాయ్ మధ్య వారిని ఎయిర్ పోర్టు నుంచి జైలుకు తీసుకెళ్లారు.

మార్గమధ్యంలో సాధారణ ట్రాఫిక్ ను నిలిపివేశారు. భవంతులపై షార్ప్ షూటర్స్ ను నియమించారు. అడుగడుగునా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దళాలు పహారా కాస్తున్నాయి. పాకిస్థాన్ మీడియా సైతం జాదవ్ తల్లి, భార్య పర్యటనపై ఆసక్తికర కథనాలను ప్రచురించాయి. పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ముందు మీడియా వాహనాలు బారులు తీరాయి. కాగా, మరికాసేపట్లో జైల్లో ఉన్న జాదవ్ ను వీరు కలవనున్నారు.
Kulbhushan Jadav
Pakistan
Death Sentence

More Telugu News