Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఈ అమ్మాయి పడట్లేదురా... రేపన్నా పడేయాలి' అంటున్న యోగి మాటలు విన్నాను: నటి హారిక

  • నన్ను ట్రాప్ చేసి పడేయాలని చూశాడు
  • మంచి ఫ్రెండేనని అనుకున్నాను
  • నా స్నేహితురాళ్లతో సంబంధాలున్నాయి
తనను ట్రాప్ చేసి వాడుకోవాలని షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగి ప్రయత్నించాడని, విషయం తనకు సాక్ష్యాలతో సహా తెలిసిపోయిన తరువాత వేధించాడని నటి హారిక ఆరోపించింది. వీరిద్దరి మధ్యా ఏర్పడిన విభేదాలు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కగా, ఓ టీవీ చానల్ తో మాట్లాడిన హారిక, "అతను నా ఫ్రెండే. నన్ను రెస్పెక్ట్ చేశాడు. మంచి ఇంప్రెషన్ చూపించేవాడు. ఎవరైనా నా గురించి అడిగితే, తను ఫైర్ బ్రాండ్. మంచిదనే చెప్పేవాడు. స్ట్రిక్ట్ అమ్మాయి, ఇలాంటివి ఎంకరేజ్ చేయదు అంటూ కాపాడేవాడు.

కానీ, తరువాత నాకు తెలిసింది. తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ, అరే... ఈ అమ్మాయి పడట్లేదురా... రేపన్నా పడేయాలి. తరువాతైనా పడేయాలి అని చెబుతున్నాడు. నా ఫ్రెండ్స్ తో రిలేషన్స్ లో ఉండి వాళ్ల పిక్చర్స్, వాళ్ల పర్సనల్ విషయాలు నాతో షేర్ చేసుకునేవాడు. ఇది కరెక్ట్ కాదనిపించి, నా ఫ్రెండ్ కు కాల్ చేసి చెప్పాను. తన బర్త్ డే నాడు కాల్ చేసి... ఓ సిస్టర్ లా చెబుతున్నాను, జాగ్రత్తగా ఉండు ఇతనితో అన్నాను. ఆ అమ్మాయి యోగికి ఫోన్ చేసి తిట్టిందట. ఏదో ఫ్రెండ్ అని షేర్ చేసుకుంటే, నువ్వు అందరికీ వాటిని చూపిస్తున్నావా? అని తిట్టడంతో, యోగికి కోపం వచ్చి, దాన్ని నాపై ప్రదర్శించడం మొదలు పెట్టాడు" అని ఆరోపించింది.
Yogi
Harika
Trap
Short Film

More Telugu News