15 మందిని దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు.. జగన్నాథ్ మిశ్రా సహా ఏడుగురు నిర్దోషులు.. జనవరి 3న శిక్ష ఖరారు!
- దాణా కొనుగోళ్ల కోసం అంటూ అక్రమంగా రూ.89 లక్షలు విత్డ్రా కేసులో తీర్పు
- నిర్దోషులుగా తేలిన వారిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా
- సీబీఐ కోర్టు పరిసరాల్లో భారీగా బందోబస్తు
కాగా, సీబీఐ కోర్టు ప్రాంగణానికి భారీగా లాలూ అనుచరులు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది కూడా భారీగా మోహరించారు. 1990-97 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కొనుగోళ్ల కోసం అంటూ అక్రమంగా రూ.89 లక్షలు విత్డ్రా చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది.