Venkaiah Naidu: వెంకయ్యనాయుడు రాక సందర్భంగా నేడు, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

  • రెండు రోజుల పాటు నగరంలో వెంకయ్య
  • ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
  • నిన్న వెంకయ్యకు స్వాగతం పలికిన గవర్నర్

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి రాక సందర్భంగా హైదరాబాదులో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 7.30 నుంచి 8.30 వరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి ఒడిశా ఐల్యాండ్, క్యాన్సర్ ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ ఆర్ నగర్, ఎన్ఎఫ్సీఎల్, పంజాగుట్ట ఫ్లైఓవర్, సీఎం క్యాంప్ ఆఫీస్, ఎయిర్ పోర్ట్ వై జంక్షన్, బేగంపేట ఎయిర్ పోర్టు, రసూల్ పుర వరకు ఆంక్షలు ఉంటాయి.

 మధ్యాహ్నం 12.45 నుంచి 1.30 వరకు కూడా ఇవే ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయి. వెంకయ్యనాయుడు నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్సీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డిలు స్వాగతం పలికారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News