yogi adityanath: యోగి ఆదిత్యనాథ్ కు ప్రకాష్ రాజ్ సూటి ప్రశ్న!

  • కర్ణాటకలో విద్వేషాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు
  • ఎన్నికల్లో గెలవడం కోసం ఏమైనా చేస్తారా
  • టిప్పు వేడుకలను ఎంజాయ్ చేస్తున్న మీ నేతలను చూడండి
హనుమంతుడి నేల అయిన కర్ణాటకలో టిప్పు సుల్తాన్ వేడుకలను నిర్వహించడమేంటంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డ సంగతి తెలిసిందే. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టిప్పుసుల్తాన్ ను హనుమంతుడు ఓడిస్తాడని అన్నారు. ఈ నేపథ్యంలో, యోగిపై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. యోగి పేరిట ఓ లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విద్వేషాలు, మత సామరస్యాన్ని నాశనం చేసే భావజాలాన్ని కర్ణాటకలో ఎందుకు వెదజల్లుతున్నారంటూ లేఖలో ఆయన ప్రశ్నించారు.

 తాను పోస్ట్ చేస్తున్న ఫొటోలను చాలా జాగ్రత్తగా గమనించాలని... కొన్నేళ్ల క్రితం టిప్పు జయంతి జరిగినప్పుడు మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో గమనించాలని అన్నారు. అప్పుడు మీకు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడం కోసం మత పరంగా జనాలను రెచ్చగొట్టడం తప్ప మీకు ప్రజల సమస్యలు పట్టడం లేదా? అని అడిగారు.
yogi adityanath
prakash raj
tippu sultan

More Telugu News