avasarala srinivas: పెద్ద హీరోలతో చేయకపోవడానికి కారణం అదే!: అవసరాల శ్రీనివాస్

  • 'ఒక్క క్షణం'లో నా పాత్ర బాగుంటుంది 
  • దర్శకుడిగా వచ్చేనెలలో సినిమా 
  • కథ నేను రెడీ చేసుకున్నదే
నటుడిగా .. దర్శకుడిగా .. రచయితగా అవసరాల శ్రీనివాస్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఒక్క క్షణం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 'ఒక్క క్షణం' సినిమాలో తన పాత్ర కొత్తగా ఉంటుందని చెప్పాడు. నటుడిగా చేస్తున్నప్పుడు దర్శకుడిగా .. దర్శకుడిగా చేస్తున్నప్పుడు నటుడిగా బ్రేక్ తీసుకుంటున్నానని అన్నాడు.

దర్శకుడిగా తన తదుపరి సినిమా వచ్చే నెలలో ఉంటుందనీ, ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని చెప్పాడు. "ఈ సినిమా కూడా నేను తయారు చేసుకున్న కథతోనే ఉంటుంది. పెద్ద హీరోలతో సినిమాలు చేయడం అనుకున్నంత తేలిక కాదు. వాళ్ల సలహాలు .. సూచనల మేరకు కథలో మార్పులు - చేర్పులు చేయవలసి ఉంటుంది. డేట్స్ విషయంలోను సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ కారణంగానే పెద్ద హీరోలతో సినిమాలు చేయడం లేదు" అని చెప్పుకొచ్చాడు.   
avasarala srinivas

More Telugu News