ఆనందంతో ఎగిరి గంతులేసిన అమల: నాగార్జున
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆనందంతో ఎగిరి గంతులేసిన అమల: నాగార్జున

  • 'హలో' ప్రమోషన్ లో బిజీగా ఉన్న నాగ్
  • సినిమా చూసిన అమల ఆనందం ఆపుకోలేకపోయింది
  • బెంగాలీ బ్లడ్ కారణంగానే అఖిల్ లో పాట పాడే గుణం
తన కుమారుడు అఖిల్ హీరోగా నిర్మితమైన తాజా చిత్రం 'హలో' ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నాగార్జున, ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చానాళ్ల క్రితమే అమల డ్యాన్స్ చేయడం మానేసిందని, అయితే, 'హలో' సినిమాను చూసి వచ్చిన తరువాత మాత్రం తన చుట్టూ ఆనందంతో గంతులేసిందని తెలిపారు. అమలకు 'హలో' సినిమా అంతలా నచ్చిందని చెప్పారు.

ఇక తన మనవడి సినిమాను తెలుగు రాకున్నా, అమల తల్లి ఇప్పటికే మూడు సార్లు చూసిందని చెప్పారు. ఈ చిత్రాన్ని చూసిన చిరంజీవి, అఖిల్ ను గట్టిగా గుండెలకు హత్తుకుని అభినందించారని, తనకు 'గీతాంజలి', 'శివ' ఉన్నట్టుగానే, అఖిల్ కెరీర్ లో 'హలో' మిగిలిపోతుందని నమ్ముతున్నానని అన్నారు. అఖిల్ లో సగం బెంగాలీ రక్తం ఉందని, ఆ మూలాలే, అఖిల్ తో 'ఏవేవో కలలు కన్నా' పాటను పాడించి వుంటాయని చెప్పారు. ఇక హీరోయిన్ ఎంపికపై మాట్లాడుతూ, ప్రియదర్శన్ కుమార్తె అన్న కారణంగా తీసుకోలేదని, ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ చేసిన తరువాత మాత్రమే ఎంపిక చేశామని తెలిపారు.
Akhil
Nagarjuna
Hello
Amala

More Telugu News