ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్లో మిథాలీ, హర్మన్, ఏక్తా బిస్త్
- వన్డే ఇంటర్నేషనల్, టీ20 టీమ్‌లను ప్రకటించిన ఐసీసీ
- రెండు టీముల్లోనూ స్థానం సంపాదించుకున్న ఏక్తా
- మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగం
వన్డే ఇంటర్నేషనల్ బృందానికి ఇంగ్లండ్ క్రీడాకారిణి హీథర్ నైట్, టీ20 బృందానికి వెస్టిండీస్ క్రీడాకారిణి స్టెఫానీ టేలర్‌లను సారథులుగా ఐసీసీ నిర్ణయించింది. ఆయా కెప్టెన్ల ఫొటోలతో టీమ్‌లకు సంబంధించిన వివరాలను ఐసీసీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళా క్రికెట్‌ను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ టీమ్‌లను ఐసీసీ ప్రకటించినట్లు తెలుస్తోంది.
