సొంతంగా వీడియో స్ట్రీమింగ్ సర్వీస్‌ను ప్రారంభించనున్న అమెజాన్
- ఇప్పటికే డొమైన్లు రిజిస్టర్ చేయించిన అమెజాన్
- పరిశీలనలో అమెజాన్ ట్యూబ్, ఓపెన్ ట్యూబ్, అలెక్సా ట్యూబ్ పేర్లు
- గూగుల్ మీద ప్రతీకారం తీర్చుకునేందుకే?
ఈ మేరకు అమెరికా పేటెంట్, ట్రేడ్ మార్క్ వద్ద కొన్ని డొమైన్లను కూడా అమెజాన్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. వీటికి అమెజాన్ ట్యూబ్, ఓపెన్ ట్యూబ్, అలెక్సా ట్యూబ్ వంటి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్‌లో కేవలం వీడియోలు మాత్రమే కాకుండా ఫొటోలు, టెక్ట్స్ మెసేజ్‌లు, డేటా, ఇతర సమాచారం కూడా షేర్ చేసుకునే వీలు కల్పించేందుకు అమెజాన్ యోచిస్తోంది. ఈ విషయమై అమెజాన్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.