ఘనంగా కరీనా, సైఫ్‌ల కుమారుడు తైమూర్ మొదటి పుట్టినరోజు... ఇవిగో ఫొటోలు!
- పటౌడీ ప్యాలెస్‌లో వేడుకలు
- హాజరైన కపూర్, పటౌడీలు
- చిన్నారికి వినూత్నమైన బహుమతి
ఈ నేపథ్యంలో బుధవారం రోజు జరిగిన పుట్టిన రోజు వేడుక ఫొటోలను కూడా సన్నిహితులు షేర్ చేశారు. తైమూర్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివాకర్ 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వుండే ఓ చిన్న అడవి లాంటి ప్రదేశాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇందులో రకరకాల మొక్కలను నాటి పెంచుతున్నారు. మహారాష్ట్ర పాల్ఘర్ ప్రాంతంలోని సొనావేలో ఈ అడవి ఉంది. ఈ విషయాన్ని రుజుత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

