డిసెంబ‌రు 31న అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ గిఫ్ట్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబ‌రు 31న అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ గిఫ్ట్‌!

  • ‘అజ్ఞాతవాసి’ సినిమాలో పాట పాడిన‌ ప‌వ‌న్
  • డిసెంబ‌రు 31న విడుద‌ల
  • ప్ర‌క‌ట‌న చేసిన సినిమా బృందం
  • అభిమానుల్లో హుషారు
నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల సంద‌ర్భంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అభిమానుల‌కు ఓ గిఫ్ట్‌ ఇవ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో పవన్‌ కల్యాణ్ న‌టించిన‌ 'అజ్ఞాత‌వాసి' విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోన్న విష‌యం తెలిసిందే. నిన్న ఆడియో విడుద‌ల కూడా జ‌రిగింది. కాగా, ‘అజ్ఞాతవాసి’ సినిమాలో ప‌వ‌న్‌ ఓ పాట పాడినట్లు ప్ర‌చారం జ‌రిగింది. అది నిజ‌మేన‌ని ఆ సినిమా యూనిట్ చెప్పేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పాడిన ఆ పాట‌ను డిసెంబరు 31న విడుదల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

గ‌తంలోనూ ప‌లు సినిమాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేకంగా పాట‌లు పాడి అల‌రించిన విష‌యం తెలిసిందే. 'అజ్ఞాతవాసి'లోనూ ప‌వ‌న్ పాడిన‌ పాట విన‌ప‌డ‌నుంద‌ని తెలుసుకుంటోన్న అభిమానుల్లో హుషారు రెట్టింప‌యింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజ్ఞాత‌వాసి సినిమా వ‌చ్చేనెల 10 విడుద‌ల కానుంది.  
Pawan Kalyan
song
agnathavasi

More Telugu News