కోహ్లీతో నన్ను పోల్చవద్దు: పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్
- నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ కోహ్లీ
- అంత గొప్ప ఆటగాడితో నన్ను పోల్చవద్దు
- బాబర్ ను కోహ్లీతో పోల్చిన మిక్కీ ఆర్థర్
పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్... బాబర్ ను కోహ్లీతో పోలుస్తూ... 23 ఏళ్ల వయసులో కోహ్లీ ఆడినట్టే బాబర్ ఆడుతున్నాడని చెప్పాడు. దీనిపై ఓ ఇంటర్వూలో బాబర్ స్పందించాడు. ప్రపంచంలోనే కోహ్లీ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ అని... అంత గొప్ప ఆటగాడితో తనను పోల్చవద్దని విన్నవించాడు. కోహ్లీతో తనను పోల్చడం కోచ్ గా మిక్కీ అభిప్రాయం మాత్రమేనని చెప్పాడు. అయితే, పాక్ తరపున తాను అత్యున్నత రీతిలో ఆడాలనుకుంటున్నట్టు తెలిపాడు.