ఆస్కార్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నామినేషన్ల బరిలో రెండు మలయాళం పాటలు
- 70 పాటల జాబితాలో 'పులిమురుగన్' చిత్రపాటలు
- స్వరాలు సమకూర్చిన గోపీ సుందర్
- జనవరి 23న నామినేషన్లను ప్రకటించనున్న ఆస్కార్స్
వీటిలో మొదటి పాటను చిత్ర, యేసుదాసు ఆలపించగా, రెండో పాటను వాణీ జయరాం పాడారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. ఈ మొత్తం జాబితాలో 'కాల్ మీ బై యువర్ నేమ్', 'కోకో', 'బ్యూటీ అండ్ ద బీస్ట్', 'మడ్బౌండ్' చిత్రాల్లోని పాటలు నామినేట్ అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఈ జాబితాలో దిగ్గజ గాయకులు టేలర్ స్విఫ్ట్, మరియా కారే, నిక్ జోనస్లు పాడిన పాటలు కూడా ఉన్నాయి. నామినేట్ అయిన పాటల జాబితాను జనవరి 23న ప్రకటించనున్నారు.