Pawan Kalyan: ఏపీ నేతలను ఎవరు ఆపుతున్నారో తెలియడం లేదు... తమిళనాడును చూసి నేర్చుకోండి: పవన్ కల్యాణ్

  • డీసీఐ ప్రైవేటీకరణను అడ్డుకుందాం
  • ఎంపీలంతా కలసి వెళ్లి మోదీని కలవండి
  • ఈ విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలి
  • ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా కలసి లాభాల్లో ఉన్న డీసీఐ (డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునే దిశగా ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. ఎంపీలంతా వెళ్లి ఆయనకు ఓ వినతిపత్రాన్ని ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని, నష్టాల్లో ఉన్నప్పటికీ, సేలం స్టీల్ ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా ఆ ప్రభుత్వం అడ్డుకుంటోందని గుర్తు చేశారు.

తమిళనాడు రాష్ట్ర ప్రజల వెనుక అక్కడి నేతలు నిలబడగా లేనిది, మన రాష్ట్రంలో నేతలు మాత్రం అదే తరహా సమస్య పరిష్కారానికి ముందడుగు వేయకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఏపీ నేతలను ఎవరు ఆపుతున్నారో అర్థం కావడం లేదని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర విభజన తరువాత అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా వంటి రాజ్యాంగ పరమైన హామీలను సైతం నెరవేర్చలేదని పవన్ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan
Janasena
DCI
Tamil Nadu
Narendra Modi

More Telugu News