Road Accident: తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఎస్సై దుర్మరణం

  • హైదరాబాద్ క్రైం విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న రఘు
  • శబరిమల వెళ్తుండగా ఘటన
  • కారులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి 
తమిళనాడులో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఎస్సై దుర్మరణం పాలయ్యారు. నగరంలోని క్రైం విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న రఘు శబరిమల వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారులో ఇరుక్కుపోయిన ఎస్సై రఘు అక్కడికక్కడే మృతి చెందారు.

రఘు మృతి వార్త తెలియడంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. దైవ దర్శనానికి వెళ్తున్న రఘు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి సహచరులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Road Accident
Tamilnadu
Hyderabad

More Telugu News