kcr: డాక్టర్ అవుతావా? ఇంజినీర్ అవుతావా? అని అడిగితే ఏదీ కానని చెప్పా: కేసీఆర్
- నాన్న అడిగితే ఏదీ కానని చెప్పా
- సాహిత్యం మీది మా గురువు మమకారం కల్పించారు
- అప్పట్లో గురువులు అంత గొప్పగా ఉండేవారు
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ గతాన్ని నెమరువేసుకున్నారు. పొదున్న ఐదున్నరకే క్రమం తప్పకుండా పాలు తీసుకుని అమ్మగారికి (తెలుగు ఉపాధ్యాయుడి సతీమణి) అప్పగించేవాడినని... అప్పటికే తమ సార్ స్నానం, పూజలు ముగించుకుని తనకు పాఠం చెప్పేందుకు రెడీగా ఉండేవారని అన్నారు. (ఈ సందర్భంగా ఆనాటి ఉపాధ్యాయుడు కేసీఆర్ పక్కనే నిల్చున్నారు)
సాహితీ ప్రపంచం కవాటాలు తెరిచి తనను అందులోకి తీసుకెళ్లారని చెప్పారు. ఏ స్వార్థం లేకుండా ఆయన తనకు అన్నీ నేర్పించారని తెలిపారు. తన తండ్రి డాక్టర్ అవుతావా, ఇంజినీర్ అవుతావా? అని తనను అడిగితే... ఏదీ కాను అని చెప్పానని అన్నారు. ఇదంతా తన గురువుగారి ప్రభావమేనని చెప్పారు. ఆ రోజుల్లో గురువులు అంత గొప్పగా ఉండేవారని తెలిపారు. మహాసభలు గొప్పగా జరుగుతుండటం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా సాహిత్యం పునర్వైభవం పొందుతుందని తెలిపారు.