ఇంద్రగంటి కథలో ఇంటికి ప్రాముఖ్యత .. అందుకే ఇంటి సెట్!
- ఇంద్రగంటి తదుపరి చిత్రం మొదలు
- సుధీర్ బాబు జంటగా అదితీ రావు
- కథలో ఇంటికి ప్రత్యేక స్థానం
ఈ సినిమాలో వాళ్లు వుండే ఇంటికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉందట. అంటే .. ఇల్లు కూడా ఒక పాత్రలా కనిపిస్తుందని అంటున్నారు. ఈ కారణంగా ఆ ఇల్లు ప్రత్యేకతను సంతరించుకోనుందట. అందువలన అలాంటి ఇల్లు కోసం గాలించిన యూనిట్ సభ్యులకు నిరాశే ఎదురైంది. దాంతో ఇంటి 'సెట్' వేయించి అందులో షూటింగ్ మొదలుపెట్టేశారు. మొత్తానికి ఈ సారి కూడా ఇంద్రగంటి నుంచి ఒక విభిన్నమైన సినిమా రానుందన్న మాట.