video: దూసుకొచ్చి హోట‌ల్ అద్దాల‌ను ఢీ కొన్న కారు.. ప‌రుగులు తీసిన క‌స్ట‌మ‌ర్లు.. వీడియో చూడండి!

  • ఇటీవ‌ల చైనాలో ఘ‌ట‌న‌
  • బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియో
  • ముందుగానే గుర్తించిన‌ క‌స్ట‌మ‌ర్లు

గేటును దాటుకుని దూసుకొచ్చిన ఓ కారు హోట‌ల్ అద్దాల‌ను ఢీ కొని ముందుకు వెళ్లిన ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది. చైనాలో ఇటీవ‌ల చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఈ వీడియోలో... తమవైపు కారు దూసుకొస్తోందని గుర్తించిన కొంద‌రు క‌స్ట‌మ‌ర్లు హోటల్‌ లోపలికి ప‌రుగులు తీశారు. మరి కొందరు మాత్రం బయటకు పరుగులు తీశారు. హోట‌ల్‌వ‌ద్ద‌కు దూసుకొచ్చి ఆ కారు ఇలా అద్దాల‌ను ధ్వంసం చేసేసింది. ఈ ఘ‌ట‌న కార‌ణంగా ఓ మ‌హిళ‌కు గాయాల‌య్యాయి. అక్క‌డి క‌స్ట‌మ‌ర్లు కారు రావ‌డాన్ని ముందుగానే గుర్తించి ప‌రుగులు తీయ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. 

More Telugu News