జనవరి నుంచి పెరగనున్న మారుతి కార్ల ధరలు

కొత్త సంవత్సరంలో మారుతి కార్ల ధరలు పెరగనున్నాయి. మెడల్ ను బట్టి పెరిగిన ధరలు రెండు శాతం వరకు ఉంటాయని మారుతి ప్రతినిధులు చెప్పారు. విడి భాగాల ధరలు బాగా పెరిగాయని... కొంత స్థాయి వరకు ఈ భారాన్ని కంపెనీయే భరించిందని... ఇప్పుడు ఈ భారం మరింత పెరగడంతో, ఆ భారాన్ని కొనుగోలుదార్ల మీద వేయక తప్పడం లేదని వెల్లడించారు. జనవరి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు, కొత్త ఏడాదిలో ధరలు పెంచుతున్నట్టు టాటా మోటార్స్, ఫోర్డ్, హోండా, టయోటా, స్కోడా, ఇసుజు కంపెనీలు కూడా ఇప్పటికే ప్రకటించాయి. 


More Telugu News