మోహన్ బాబు 'గాయత్రి' రిలీజ్ డేట్ ఖరారు
- మోహన్ బాబు ప్రధాన పాత్రగా 'గాయత్రి'
- ప్రత్యేక పాత్రలో మంచు విష్ణు
- ఫిబ్రవరి 9వ తేదీన విడుదల
మోహన్ బాబు పాత్ర ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుందనీ, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఆయన కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు ప్రత్యేకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, శ్రియ .. నిఖిలా విమల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.