YSRCP: మమ్మల్ని రెచ్చగొట్టొద్దు: జగన్ కు పరిటాల సునీత హెచ్చరిక

  • జగన్ పై మండిపడ్డ పరిటాల సునీత
  • ఆయన వ్యాఖ్యలు బాధ కలిగించాయి
  • ఫ్యాక్షన్ లీడర్లను ప్రజలు తరిమికొడతారు
  • విమర్శించే ముందు ఆలోచించుకోవాలని హితవు
తాను ఫ్యాక్షన్ ను పెంచి పోషిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పరిటాల సునీత తీవ్రంగా మండిపడ్డారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె, తన పాదయాత్రలో భాగంగా రాప్తాడులో జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. జగన్ వ్యాఖ్యలు తనకు బాధను కలిగించాయని తెలిపారు. తమను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని హెచ్చరించిన ఆమె, ఫ్యాక్షన్ లీడర్లను రాయలసీమ ప్రజలు తరిమికొడుతారని అన్నారు. ఏదైనా మాట్లాడేముందు, విమర్శించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సునీత హితవు పలికారు.
YSRCP
Jagan
Paritala Sunita
Raptadu
Padayatra

More Telugu News