ఏపీ సచివాలయంలో రాజమౌళి!

దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఈరోజు ఏపీ సచివాలయానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజమౌళి కూడా పాల్గొన్నారు. మంత్రి నారాయణ, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. రాజధానిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, వివిధ విభాగాల డిజైన్లను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. భవన నమూనాలను నార్మన్ ఫోస్టర్ సంస్థ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డిజైన్లకు సంబంధించి రాజమౌళి సూచనలు అందించారు.


More Telugu News